‘జెర్సీ’ పోస్ట్ రిలీజ్ ప్రోమో-3 చూశారా ?


నాని ‘జెర్సీ’ థియేటర్స్ లో సందడి చేస్తోంది. మెగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అంతకుమించి.. ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఆనందంలో ఉన్న చిత్రబృందం.. సినిమా ప్రమోషన్స్ ని మాత్రం ఆపడం లేదు. జెర్సీ పోస్ట్ ప్రోమోస్ ని విడుదల చేస్తోంది.

తాజాగా జెర్సీ పోస్ట్ ప్రోమో3ని వచ్చేసింది. ఇందులో నాని.. క్రికెట్ ఆడుతున్న ఆటగాడి లవ్వర్ తో మాట్లాడుతూ కనిపించారు. మీ బాయ్ ఫ్రెండ్ బాడీ బ్యాలెన్స్ సింగింగ్ గా లేదు. లెగ్ స్పిన్స్ లో అవుటయ్యే ఛాన్స్ ఎక్కువ అని చెప్పగానే.. ఆ ఆటగాడు అలాగే అవుటవ్వడం చూడొచ్చు. ‘ఏం నోరు సార్ అదీ.. ఇలా చెప్పగానే అలా జరిగిపోయింది’ అమ్మాయి ఆశ్చర్యపోవడం చూడొచ్చు.