హిట్ సినిమాలని డ్యామినేట్ చేస్తున్న ప్లాప్ సినిమా.. !

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. హిట్, మెగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని ఓ ప్లాప్ సినిమా డ్యామినేట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన మజిలీ, చిత్రలహరి సినిమాలు హిట్ టాక్ ని సొంతం చేసుకొన్నాయి. ఇక, గత శుక్రవారం విడుదలైన నాని ‘జెర్సీ’ మెగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. ప్రేక్షకులు, సినీస్టార్ ‘జెర్సీ’ని గొప్ప సినిమాగా అభివర్ణించారు. ‘జెర్సీ’తో పాటు విడుదలైన ‘కాంచన3’ మాత్రం ప్లాప్ టాక్ ని తెచ్చుకొంది.

కలెక్షన్స్ లో మాత్రం ‘కాంచన3’ హిట్ టాక్ సినిమాలు మజిలీ, చిత్రలహరి, జెర్సీలని డ్యామినేట్ చేస్తోంది. కొన్ని ఏరియాల్లో కాంచన3 వసూళ్లు జెర్సీ ని మించిపోయాయి. టాక్ తో సంబంధం లేకుండా కాంచన3ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా బి, సి సెంటర్స్ లో కాంచన3 హవా చూపిస్తుంది. హారర్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్.. మాస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

నంద్యాలలో ‘చిత్రలహరి’ 23,394 గ్రాస్, 10,316 షేర్ ను రాబట్టింది. జెర్సీ 1,32,105 గ్రాస్ ను, 8,1,531 షేర్ ను రాబట్టింది. డబ్బింగ్ సినిమా ‘కాంచన 3’ ఇక్కడ రూ 2,34,866కోట్ల గ్రాస్, రూ.1,65,194కోట్ల షేర్ ని రాబట్టడం విశేషం. జెర్సీ సినిమా కంటే కాంచన3 కలెక్షన్స్ దాదాపు 20రెట్లు అదనం. లారెన్స్ ని స్లో పాజిన్ అంటుంటారు. ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసు. కాంచన, కాంచన2 బి, సి సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు మూడో కాంచన అదే చేస్తోంది. ఏకంగా మెగా బ్లాక్ బస్టర్ హిట్ జెర్సీని మించిన కలెక్షన్స్ తో అదరగొడుతోంది.