మహర్షి ప్రీ-రిలీజ్ వేడుక ఎప్పుడు.. ఎక్కడ ?

‘మహర్షి’గా మహేష్ మే9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. మహర్షి లిరికల్ సాంగ్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మహర్షి నుంచి మూడు పాటలొచ్చేశాయ్. నాల్గో పాట ఈరోజు విడుదల కానుంది. మరోవైపు, మహర్షి ప్రీ-రిలీజ్ వేడుక ముహూర్తం ఫిక్సయింది. మే1 మహర్షి ఫంక్షన్ జరగనుంది. ఇందుకోసం
హైదరాబాద్ – నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాని బుక్ చేశారు.

మహష్ నటిస్తున్న 25వ చిత్రమిది. ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో మహెష్ మూడి ఢిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. కాలేజ్ స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతుగా మహేష్ కనిపిస్తాడు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 90కోట్ల బడ్జెట్ ఖర్చయింది. అదే రేంజ్ లో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్టు చెబుతున్నారు. మహర్షి దాదాపు రూ. 140కోట్ల ప్రీ రిలీజ్ చేశాడని చెబుతున్నారు.