#RRR షూటింగ్’లో తారక్ కు గాయాలు.. !
ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వడోదరా షెడ్యూల్ లో రామ్ చరణ్ గాయపడిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ఆ షెడ్యూల్’ని క్యాన్సిల్ చేసుకొని చిత్రబృందం హైదరాబాద్
కి తిరిగొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ తాజా షెడ్యూల్ కొనసాగుతోంది. ఐతే, ఇక్కడ షూటింగ్ తారక్ గాయపడినట్టు తెలుస్తోంది. ఆయన కుడి చేతి కట్టు కనిపిస్తోంది. షూటింగ్ సమయంలో లేదా జిమ్ లో తారక్ గాయపడి ఉంటారని చెబుతున్నారు. అయినా.. తారక్ కు విశ్రాంతి ఏమీ తీసుకోవడం లేదు. షూటింగ్ లోపాల్గొంటున్నారు. దీంతో అది చిన్న గాయమేనని అంటున్నారు.
మరోవైపు తారక్ కోసం హీరోయిన్ వేటని కొనసాగిస్తూనే ఉన్నారు జక్కన్న. ఆర్.ఆర్.ఆర్ నుంచి హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకొంది. ఆమె స్థానంలో హీరోయిన్ గా నిత్యామీనన్, శ్రద్దాకపూర్, నివేదా థామస్, పరిణీత చోప్రా.. తదితర పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిలో నిత్యామీనన్ తీసుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది జూన్ 30న ఆర్.ఆర్.ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి రేంజ్ ఆర్.ఆర్.ఆర్ ని విడుదల చేయనున్నారు.