మహర్షి : ‘పదరా పదరా.. ‘ పాట విన్నారా.. ?

మహర్షి’ రైతు సాంగ్ వచ్చేసింది. ‘పదరా పదరా.. ’ అంటూ సాగిన ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చగా.. ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. పాట అద్భుతంగా ఉంది. పాటలు మహేష్ వ్యవసాయం చేస్తుండటం చూడొచ్చు. ఇప్పటి వరకు మహర్షి నుంచి విడుదలైన నాలుగు పాటల్లో ఇదే బెస్ట్ సాంగ్ గా చెప్పవచ్చు. ఇక మహర్షి ప్రీ-రిలీజ్ వేడుక ముహూర్తం ఫిక్సయింది. మే1 హైదరాబాద్ – నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాని వేదికగా మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రమిది. వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. ఈ చిత్రంలో మహెష్ మూడి ఢిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. కాలేజ్ స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతుగా మహేష్ కనిపిస్తాడని చెబుతున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.