మోడీతో అక్షయ్ ఇంటర్వ్యూ.. షాకింగ్ నిజాలు !


బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేశారు. ఇందులో మోడీ చెప్పిన కొన్ని విషయాలు షాక్ కి గురి చేస్తున్నాయి. అసలు మోడీకి మొదట్లో రాజకీయాల్లోకి రావాలనే కోరికే ఉండేది కాదట. ఐతే, ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనే కోరిక మాత్రం బలంగా ఉండేదట. ప్రముఖుల జీవిత చరిత్రలు చదవడం మోడీ చాలా ఇష్టమట. అదే తనని రాజకీయాల్లోకి వచ్చేలా చేసిందని చెప్పుకొచ్చాడు మోడీ. తాను కఠినంగా ఉంటా. కానీ, ఎవరినీ అవమానించబోను. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం తనకు బాగా అలవాటైంది. అందువల్లే ఒత్తిడిలో సైతం పని చేస్తున్నానని ప్రధాని తెలిపారు.

ప్రధాని రోజుకి కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారట. తన శరీరానికి నాలుగు గంటల నిద్ర సరిపోతుందని, అలసటగా ఎన్నడూ అనిపించదన్నారు. ఐతే, రాజకీయాల నుంచి రిటైర్ అయిన తరువాత మాత్రం నిద్రకు అధిక సమయం కేటాయిస్తానని తెలిపారు. కాంగ్రెస్ నేత ఆజాద్ తనకెంతో ఆప్తమిత్రుడు. నిత్యమూ తనను తిడుతూ ఉండే మమతా బెనర్జీ సైతం మిత్రురాలే. ఆమె ప్రతి సంవత్సరం తనకు మిఠాయిలు పంపుతుంటారని గుర్తు చేసుకున్నారు మోడీ. స్వీట్స్ తో పాటు కొత్త దుస్తులను కూడా పంపిస్తారట దీదీ. రాజకీయాలు వేరు. స్నేహం వేరు అంటే ఇదేనేమో.. ! ఇక, తనకు సన్యాసి జీవితం అలవాటైపోయిందన్నారు మోడీ.