మల్లారెడ్డి.. గిదేం పని !

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చేశాడు. సభలు, సమావేశాల్లో మల్లారెడ్డి స్వీచ్ హాట్ టాపిక్ గా మారిన సందర్భాలున్నాయి. ఆయన వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. వాటిని చూసి జనాలు ఎంజాయ్ చేశారు. ఐతే, తొలిసారి మల్లారెడ్డి చేసిన ఓ పనిపై నెగటివ్ టాక్ వస్తోంది. మంత్రి లెటర్ ప్యాడ్ ని దుర్వినియోగం చేశాడు.

జలపురం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని కీసర మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ లెటర్ ప్యాడ్ ని విడుదల చేశాడు మంత్రి మల్లారెడ్డి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. వాస్తవానికి లెటర్ హెడ్స్ ప్రజా సంక్షేమం కోసం, ప్రభుత్వ కార్యక్రమాల కోసం మాత్రమే వాడాల్సి ఉంటుంది. మంత్రి మాత్రం పార్టీ కార్యకలాపాల కోసం ఉపయోగించి అడ్డంగా దొరికిపోయాడు.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చేల్ నియోజకవర్గ స్థానం నుంచి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన కేసీఆర్ కేబినేట్ లో స్థానం సంపాదించుకొన్నారు. ప్రస్తుతం తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఇక, మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయనకు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి నుంచి గట్టిపోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారన్నది మే 23న తెలవనుంది