జెర్సీ కోసం డజను క్లైమాక్సులు
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని ‘జెర్సీ’ని మెగా బ్లాక్ బస్టర్ హిట్ గా తేల్చేశారు ప్రేక్షకులు. గౌతమ్ తిన్ననూరి కథని నడిపించిన విధానానికి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సినిమా చివరి 20 నిమిషాలు అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు.
యాంటీ క్లైమాక్స్ తో దర్శకుడు ప్రేక్షకులని మెప్పించడం విశేషం. ఐతే, జెర్సీ కోసం దర్శకుడు 12, 13 వెర్షన్లు రెడీ చేసుకున్నాడట. చివరికి ఇప్పుడున్న క్లైమాక్స్ ఫిక్స్ చేశారట. చాలా రకాలుగా ఆలోచించినా సరే.. షూట్ చేసింది ఒక్కటే క్లైమాక్స్.
ఇక జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతున్నట్టు వార్తలొచ్చాయ్. తారక్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఐతే, ఇప్పటి వరకు ఎవరితో సినిమా ఓకే కాలేదు. కొన్నాళ్లు విశ్రాంత్రి తీసుకొన్న తర్వాత తదుపరి సినిమా కోసం పని మొదలు పెడతానంటున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఎన్ టీఆర్ తో సినిమా ఓకే కాలేదని క్లారిటీ ఇచ్చారు.