ఇంటర్ వ్యవహారంపై అఖిలపక్షం డిమాండ్స్.. ఇవీ !
ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత అంశాలపై గవర్నర్‌తో అఖిల పక్ష నేతలు భేటీ అయ్యారు. ఉత్తమ్‌తో పాటు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, తెజస అధ్యక్షుడు కోదండరామ్, షబ్బీర్ అలీ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్ బోర్డ్ వ్యవహారంలో అఖిలపక్షం డిమాండ్ లని తెలిపారు. ఇంటర్ బోర్డు వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు నమ్మకం కోల్పోయా రు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని పదవి నుంచి వెంటనే తొలగించాలి. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలి. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ కు వినతిపత్రం అందజేసినట్టు ఉత్తమ్ తెలిపారు.