కొండా విశ్వేశ్వర రెడ్డి అరెస్ట్
చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి అరెస్ట్’కు రంగం సిద్ధమైంది. ఆయన్ని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో విశ్వేశ్వర్ రెడ్డిపై అరెస్ట్ వారంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. కొండా బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఈ నేపథ్యంలో కొండాని ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఐతే, కొండా వారం రోజులుగా అజ్ఝాతంలో ఉన్నారు.
2014 ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర రెడ్ది చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేవేళ్ల నుంచి బరిలో నిలిచారు. ఈ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉండనుందని చెబుతున్నారు. ఎవరు గెలుస్తారన్నది మే 23న తేలనుంది.