‘భారత్’ స్లో మోషన్ సాంగ్.. చూశారా?


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘భారత్’. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. కత్రినాకైఫ్, దిశా పటానీ హీరోయిన్లు. ఈ చిత్రంలో సల్మాన్ దాదాపు ఐదు గెటప్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా, గని కార్మికుడిగా, నేవీ అధికారిగా పలు పాత్రలలో సందడి చేయనున్నాడు. ఈద్ కానుకగా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పెంచింది చిత్రబృందం. మొదట చిత్ర పోస్టర్స్ విడుదల చేసిన టీం రీసెంట్‌గా ట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా స్లో మోషన్ అనే సాంగ్ వీడియో విడుదల చేసింది. మేఘదీప్ బోస్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సాంగ్‌కి ఇర్షద్ కమల్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌లో సల్మాన్ , దిషా పఠానీలు అదిరిపోయే స్టెప్ లతో ఆకట్టుకొన్నారు. భారత్ స్లో మోషన్ సాంగ్ ని మీరు చుసేయండీ.. !