ఎఫ్ 2 ఫ్లేవర్ తో ‘అల్లాదిన్‌’ టీజర్


గాయ్‌ రిట్చయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమెరికన్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘అల్లాదిన్‌’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో జీనీగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ కనిపించనున్నాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్‌ నటిస్తుండగా, ప్రిన్స్‌ జాస్మిన్‌గా నయోమి స్కాట్‌ అలరించనుంది.

తెలుగు ‘అల్లాదిన్‌’లో ఎఫ్ 2 ఫ్లేవర్ కనిపించనుంది. ఈ సినిమా కోసం ఎఫ్ 2 హీరోలు వెంకీ, వరుణ్ తేజ్ లు వాయిస్ ఓవర్ అందించారు. జీనికి వెంకటేష్‌ వాయిస్ ఇవ్వగా, అల్లాదిన్‌కు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ‘ఎఫ్‌2’లో అలరించిన వీరిద్దరూ జీనీ-అల్లాదిన్‌ వాయిస్‌లతో ఈ సినిమాకు మరింత క్రేజ్‌ తీసుకొచ్చారని చెప్పవచ్చు. ‘అల్లాదిన్‌’ మే 24 విడుదలకానుంది.