ధోని లేని చెన్నై.. మరోసారి ఓటమి !
ధోని లేని చెన్నై జట్టు పరిస్థితి ఏంటన్నది మరోసారి రుజువైంది. శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని లేడు. ఆయనస్థానంలో సురేష్ రైనా కెప్టెన్ బాధ్యతలని నిర్వహించారు. ఈ మ్యాచ్ లో ముంబై 46పరుగుల తేడాతో చెన్నైని ఓడించింది. మొదటి బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్‌శర్మ(67; 48 బంతుల్లో 6×4, 3×6), ఎయిన్ లూయిస్ (32; 20 బంతుల్లో 3×4, 1×6) రాణించారు.
156 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై మొదటి మూడు వికెట్లు త్వరగా కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ షేన్‌వాట్సన్(8), సురేశ్‌రైనా(2), అంబటిరాయుడు(0) ఔటయ్యారు. 17.4ఓవర్లలో చెన్నై ఆలౌట్ అయింది. చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మలింగ్ 4, బూమ్రా 2, క్రూనాల్ పాండ్యా 2, హార్థిక్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు.
తొమ్మిదేళ్లలో తొలిసారిగా ఓ మ్యాచ్ నుంచి ధోని విశ్రాంతి తీసుకున్నాడు. గత వారంలో జరిగిన ఆ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై ఓడిపోయింది. ధోని విశ్రాంతి తీసుకొన్న తాజా మ్యాచ్ లోనూ చెన్నై ఓడింది. దీంతో ధోని లేని చెన్నై జట్టుని ప్రేక్షకులు ఊహించికోరు. ధోని లేకుండా ఆ జట్టు విజయాలు సాధించలేదన్నది స్పష్టమవుతోంది.