రకుల్ తో కలిసి నాగ్ వర్క్‌ అవుట్స్


రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి నాగార్జున చెమటలు కక్కిస్తున్నారు. ఇద్దరు కలిసి జిమ్ లో వర్క్‌ అవుట్‌ చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోని నాగ్ షేర్ చేశాడు. నాగ్-రకుల్ జంటగా నటిస్తున్న ‘మన్మథుడు 2’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది. కాగా షూటింగ్‌కు ముందు రకుల్‌ప్రీత్‌ సింగ్‌తో కలిసి జిమ్‌లో వర్క్‌ అవుట్‌ చేస్తున్న వీడియోను నాగ్‌ పంచుకున్నారు. ఈ వీడియోను దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ షూట్‌ చేశారు.

‘షాట్‌ రెడీ అయిపోయింది. వెళ్దామా సర్‌’ నాగ్‌ను రాహుల్ సెట్‌కు పిలుస్తూ కనిపించారు. పోర్చుగల్‌లోని జిమ్‌ బాగుందని, మన దగ్గర కూడా అలాంటిది ఉంటే బాగుండేదని నాగ్‌ అన్నారు. మరోపక్క రకుల్‌ ఆపకుండా కసరత్తులు చేస్తున్నారు. ‘ఆమె అద్భుతంగా వర్క్‌ అవుట్‌ చేస్తోంది. ముందు షాట్‌ నా మీద తీయ్యి తను వర్క్‌ అవుట్‌ చేసిన తర్వాత వస్తుంది. డిస్టర్బ్‌ చేయొద్దు’అని నాగ్‌ బదులిచ్చారు.ఈ వీడియోతో పాటు కొన్ని ఫోటోలని విడుదల చేసించి చిత్రబృందం

ఇటీవల నాగార్జున జిమ్ వర్క్ అవుట్ ఫోటోలని రాహుల్ రవీంద్రన్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ్-రకుల్ కలిసి చెమటలు కక్కిస్తున్న జిమ్ వర్క్అవుట్ వీడియో కూడా వచ్చేసింది.ఇక ‘మన్మథుడు 2’ చిత్రాన్ని నాగార్జున-జెమినికిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.