కేసీఆర్ సర్కార్’కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. ఇంటర్ బోర్డు వ్యవహారంపై నివేదిక కోరింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను సుమోటాగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌కు నోటీసులు పంపింది. 3లక్షల మంది విద్యార్థులు పరీక్ష తప్పడంతో ఆందోళన నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీనిపై 4వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇంటర్ బోర్డ్ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారింది. 18మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడటం అదరినీ కలచివేస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోనికి వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఉంటే.. విద్యార్థుల ప్రాణలు తగ్గేవి. ఇవి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేననే విమర్శలొస్తున్నాయి. ఇక, కాస్త లేటుగా ఇంటర్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొన్న కేసీఆర్ ప్రభుత్వం ఫయిలైన విద్యార్థుల పేపర్లని పున: పరిశీలించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. గిదే పని ముందే జేస్తే బాగుండేమో !