బన్నీ కండీషన్స్’కు త్రివిక్రమ్ షాక్

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ఏరికోరి దర్శకుడు త్రివిక్రమ్ ని మరోసారి ఎంచుకొన్నాడు. ఆయన కోసం ఓ ఆర్నేళ్లు వెయిట్ చూశారు. సినిమా ప్రారంభం అయ్యాక కూడా ఓ మూడ్నేళ్లు ఓపిక పట్టాడు. ఇటీవలే బన్నీ-త్రివిక్రమ్ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ఐతే, తొలి షెడ్యూల్ లోనే తేడా కొట్టినట్టు సమాచారమ్. అదీ కూడా బన్నీ కారణంగా అని తెలిసి షాక్ అవుతున్నారు.

హైదరాబాద్ లో జరిగిన మొదటి షెడ్యూల్ కి బన్నీ కుటుంబ సమేతంగా వచ్చాడు. బన్నీపై ఓ ఫైట్ సీక్వెన్స్ తీశారు. దీంతో తొలి షెడ్యూల్ పూర్తికావాలి. ఐతే, ఈ షెడ్యూల్ లో అదనంగా మరో 2సన్నివేశాలు తీయాలని అనుకున్నారట త్రివిక్రమ్. దానికి బన్నీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే షూటింగ్ జరగాలని, ఎక్స్ ట్రా కాల్షీట్ ఒక్కటి కూడా ఇచ్చేదిలేదని తెగేసి చెప్పేశాడట.

అంతేకాదు.. నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడనే విషయాన్ని తనకు 2 వారాల ముందే చెప్పాలని కండిషన్ పెట్టాడట. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్, హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కారణంగానే అభిప్రాయ బేధాలు వస్తున్నాయని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లోనే తేడా కొడితే.. సినిమా పూర్తయ్యేలోపు ఎన్ని గొడవలు జరుగుతాయో.. చూడాలి.