లగడపాటి ఏపీ ఫలితం చెప్పేశారు
ఏపీ ఫలితంపై లగడపాటి రాజగోపాల్ రెడ్డి మరోసారి నోరువిప్పాడు. అమెరికాలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల ఫలితంపై స్పందించారు. ఏపి ప్రజలు సంక్షేమం, అభివృద్దికే పట్టంకట్టారని వ్యాఖ్యానించారు. ఐతే, సర్వే పూర్తి వివరాలని మే19న వెల్లడిస్తానని తెలిపారు. తెలంగాణ ఫలితాల్లో తన సర్వే ఎందుకు ఫెయిల్ అన్న విషయాలపై కూడా క్లారిటీ ఇస్తానన్నారు. ఇక, మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్న టీడీపీ ధీమా వెనక ఉన్నది లగడపాటియే అని తెలుస్తోంది. ఆయన సర్వే వివరాలని ముందుగానే ఏపీ సీఎం చంద్రబాబుకు లీక్ చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఫలితాల సర్వే విషయంలో జాతీయ ఛానెల్స్ వర్సెస్ లగడపాటి సర్వేగా మారింది. జాతీయ సర్వేలన్నీ తెలంగాణ మరోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో వస్తుందని చెప్పాయి. లగడపాటి సర్వే మాత్రం తెలంగాణలో మహాకూటమిదే అధికారం అన్నాడు. ఫైనల్ గా లగడపాటి సర్వే తుస్సుమంది. ఇప్పుడు ఏపీలో ఫలితాలపై ఇదే పరిస్థితి. జాతీయ సర్వేలన్నీ ఏపీలో వైకాపాదే అధికారం అంటున్నాయి. మే 23 తర్వాత చంద్రబాబుకు రిటైర్డ్మెంట్ అంటున్నాయి. అందుకు భిన్నంగా లగడపాటి ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రాబోతుంది అంటున్నారు. మరీ.. ఈసారైనా లగడపాటి సర్వే నిజమవుతుందో చూడాలి.