‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై లోకల్ ఎఫెక్ట్
ఏపీలో ఎటాక్ చేసేందుకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రెడీ అయిన సంగతి తెలిసిందే. మే1న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏపీలో విడుదల కాబోతున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. మరోవైపు, మరోసారి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలని అడ్డుకునేందుకు టీడీపీ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్. మార్చి 29న ఒక్క ఏపీలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకొంది. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఏపీలో మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఈసీ బ్రేక్ వేసింది. ఎన్నికలు పూర్తయిన తర్వాతే సినిమాని విడుదల చేసుకోవాలని ఏపీ హైకోర్టు కోర్టు ఆదేశించింది. దీంతో.. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఆగిపోయింది.
ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మే1న ఏపీలో విడుదలకావడం ఖాయం అనుకొన్నారు. ఐతే, ఈసారి లోకల్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ పై పడేలా కనిపిస్తోంది. మే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలని మళ్లీ వాయిదా వెయ్యాలని టీడీపీ నేతలు కోరే అవకాశాలున్నాయి. ఎందుకంటే ? లక్ష్మీస్ ఎన్టీఆర్ లో సీఎం చంద్రబాబుని విలన్ చేసి చూపించాడు వర్మ. ఆ సినిమా ఎఫెక్ట్ ఎంతో కొంత జనాలపై పడుతుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేవరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలని ఆపేందుకు టీడీపీ శ్రేణులు కచ్చితంగా ప్రయత్నించవచ్చు.