శ్రీలంక పయనం వద్దు.. కేంద్రం సూచన !

ఈస్టర్ ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లతో శ్రీలంక రాజధాని కొలంబో దద్దరిపోయింది. వందలాది మంది మృతి చెందారు. శ్రీలంకలో ఇంకా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనే ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని.. ఆ దేశానికి ‘తప్పనిసరికాని ప్రయాణాలు ’చేయవద్దంటూ కేంద్రం ఓ అడ్వైజరీని జారీచేసింది.

‘ఏప్రిల్ 21, 2019న జరిగిన ఉగ్రవాద దాడుల తరవాత శ్రీలంకలో నెలకొని ఉన్న భద్రతాపరమైన పరిస్థితులను దృష్టిలోఉంచుకొని ఆ దేశానికి తప్పనిసరికాని ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నాం’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అడ్వైజరీని జారీ చేసింది.

‘శ్రీలంక ప్రభుత్వం దేశంలో భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. జాతీయ అత్యవసర పరిస్థితితో పాటు రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధిస్తోంది. ఇవి మీ ప్రయాణాల మీద ప్రభావం చూపించవచ్చు. ఒకవేళ ఎవరైన అత్యవసర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అవసరమైతే కొలంబోలోని హై కమిషన్‌ లేక హంబన్‌టోట, జాఫ్నాలో ఉన్న అసిస్టెంట్ హై కమిషన్‌ను సంప్రదించవచ్చు’ అని వెల్లడించింది.