వరుణ్ ధావన్ పెళ్లి ఫిక్స్

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ గత కొద్దికాలంగా నటాషా దలాల్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా, వరుణ్ పెళ్లి వార్తలపై ఆయన తండ్రి, దర్శకుడు డేవిడ్ ధావన్ స్పందించారు. వచ్చే ఏడాది వరుణ్ పెళ్లి జరిగే అవకాశం ఉంది అని పేర్కొన్నాడు.

తండ్రి స్టేట్ మెంట్ పై ధావన్ స్పందించారు. ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నాను. నా తండ్రి నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. నా తండ్రి ఆకాంక్షలకు ఎప్పుడూ లోబడి ఉంటాను. నా అభిప్రాయాలను నా తల్లిదండ్రులు గౌరవిస్తారు అన్నారు. దీంతో వచ్చే యేడాది వరుణ్ ధావన్ పెళ్లి ఫీక్సయినట్టయింది.

ప్రస్తుతం వరుణ్ ధావన్ స్టీట్ డ్యాన్సర్ 3డీ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే తెలుగులో ఘనవిజయం సాధించిన కూలీ నంబర్ 1 చిత్రం రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు.