కోల్‌కతా(232/2) గట్టిగా కొట్టింది
ముంబై ముందు భారీ టార్గెట్ ఉంచింది కోల్‌కతా. మొదటి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్ ఇది. ఓపెనర్లు శుభ్‌మన్‌గిల్(76; 45 బంతుల్లో 6×4, 4×6), క్రిస్‌లిన్(54; 29 బంతుల్లో 8×4, 2×6) ధాటిగా ఆడి శుభారంభానిచ్చారు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆండ్రీ రసెల్(80; 40బంతుల్లో 6×4, 8×6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో.. ముంబయి ముందు 233 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది.
233 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోని ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ డికాక్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం 8.4ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 60పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. క్రీజులో పోలార్డ్ 5, హార్థిక్ ప్యాండ్యా1 ఉన్నారు. ముంబై చేయవలసిన రన్ రేటు 15పైకి చేరుకొంది. ఈ నేపథ్యంలో ముంబై గెలవడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు.
Massive total put up thanks to some fantastic batting by @RealShubmanGill, @lynny50 and @Russell12A. However, with a beautiful surface to bat on and a lightning quick outfield, this could turn out to be a very close game. What do you think guys? 😊 #KKRvMI
— Sachin Tendulkar (@sachin_rt) April 28, 2019