పాతబస్తీలో రేవ్ పార్టీ.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టుల అరెస్టు !

హైదరాబాద్ పాతబస్తీలో రేవ్ పార్టీ నిర్వహణ వ్యవహారం వెలుగు చూసింది. పాతబస్తీలో పహడీ షరీఫ్ పోలీసు స్టేషన్ ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, 18 మంది బాడీ బిల్డర్లను అరెస్టు చేశారు. బర్త్ డే పార్టీల పేరుతో నదీం అహ్మద్ అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రేవ్ పార్టీకి 16 మంది యువకులు, ముగ్గు యువతులు, ఓ మోడల్ హాజరయ్యారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అక్కడి నుంచి కేకలు వినిపించడంతో సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వనస్థలిపురం పోలీసులు పాంహౌస్‌లోకి వెళ్లి చూశారు. లోపల యువతీ యువకులు మద్యం మత్తులో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తుండటంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో అందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.