విజయవాడలో వర్మ అరెస్ట్ !

విజయవాడ పోలీసులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మే1న ఏపీలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయవాడ వెళ్తున్నట్టు వర్మ ట్విట్ చేశారు. ఐతే, సినిమా ప్రెస్ మీట్ కోసం విజయవాడ హోటల్స్ అనుమతి లభించడం లేదు. అందరికీ తెలిసిన వ్యక్తి బెదిరింపుల వలన హోటల్ యాజమాన్యాలు భయపడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానని వర్మ ట్విట్ చేశారు. ఐతే, విజయవాడకు చేరుకొన్న వర్మని పోలీసులు అనుక్షణం ఫాలో అయ్యారు. చివరికి వర్మని అరెస్ట్ చేశారు.

నిజంగానే వర్మ నడిరోడ్డు మీద ప్రెస్ మీడితే శాంతిభద్రతల సమస్య ఎదురవుతుందని పోలీసులు భావించారు. ప్రెస్ మీట్ పెట్టవద్దని వర్మని కోరినట్టు కూడా తెలుస్తోంది. అందుకు ఆయన ఒప్పుకోకపోవడం.. అదుపులోని తీసుకొన్నట్టు సమాచారమ్.
మధ్యాహ్నం మూడు గంటలకు ఉన్న విమానంలో వర్మని హైద్రాబాద్‌కు పంపనున్నారు. విమానంలో హైద్రాబాద్‌కు పంపడం సాధ్యం కాకపోతే రోడ్డు మార్గంలో పంపాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా.. ఏపీలో వర్మ ప్రెస్ మీట్ పెట్టకుండా చేయడంలో టీడీపీ వర్గాలు విజయం సాధించాలని చెప్పవచ్చు.