హీరో కారు ప్రమాదంపై తప్పుడు ప్రచారం
టాలీవుడ్ యువ హీరో సుధాకర్ కారు శనివారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం
చినకాకాని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా మృతి చెందింది. హీరో సుధాకర్ కి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో సుధాకర్ కారు నడిపారు. ఆయన నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని టీవీ ఛానెల్స్, వెబ్ సైట్స్ లో వార్తల్లొచ్చాయ్. దీనిపై ఆదివారం సుధాకర్ మీడియాకు వివరణ ఇచ్చారు.
ప్రమాదం జరిగిన సమయంలో తాను కారు వెనక సీట్లో కూర్చొన్న “నువ్వు తోపురా” చిత్ర ప్రమోషన్స్ గురించి చిత్రబృందంతో చాట్ చేస్తున్నా.. ఒక్కసారిగా కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. నా చేతివేలు సగం కట్ అయింది. డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సీటు బెల్ట్ లేకుంటే తాను చనిపోయేవాడిని. ఐతే, ప్రమాదం జరిగిన సమయంలో తాను డ్రైవింగ్ చేశానని.. తన నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందనే ప్రచారం జరిగింది. ప్లీజ్ ఇలాంటి విషయాల్లో నిజం తెలుసుకొని రాయండని కోరారు సుధాకర్. ఇక, మృతి చెందిన మహిళా విషయంలో చాలా బాధగా ఉంది. తన చిత్రబృందం, తనవంతుగా ఆమె కుటుంబాన్ని ఆదుకొనే ప్రయత్నం చేస్తామన్నారు.