‘జెర్సీ’ని చూసి ఏడ్ఛేసిన రానా.. !


గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకొంది. నాని నటన, గౌతమ్‌ దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఈ సినిమాని చూసి రానా దగ్గుపాటి ఏడ్చేశాడట. ఈ విషయాన్ని ఆదివారం హైదరాబాద్ లో జరిగిన జెర్సీ సక్సెస్ మీట్ లో నాని తెలిపారు.

సినిమా చూసిన వెంటనే రానా ఫోన్ చేశాడు. అప్పుడు రానా గొంతు నాకు ఇంకా గుర్తుంది. దాదాపు ఏడ్చేశాడు. అంత ఎమోషన్ కి గురయ్యాడు. ఆ తర్వాత కలిసి సినిమా గురించి గంటసేపు మాట్లాడాడు. ఇవాళ పిలవగానే సక్సెస్ మీట్ కు వచ్చాడు. అందుకు థ్యాక్స్. ‘జెర్సీ’ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతూ మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫైనల్ గా ప్రేక్షకులకి థ్యాంక్స్ చెబుదామని మీ ముందుకొచ్చామని తెలిపారు నాని.