జగన్’పై ఆశలు వదిలేసుకొన్న కేటీఆర్.. !

ఏపీలో జగన్ వస్తాడు. సీఎం అవుతాడు. మొదటి నుంచి తెరాస పాడుతున్న పాట ఇది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు, తర్వాత కూడా సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ జగన్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఐతే, ఆ ధీమా రానురాను సన్నగిల్లుతున్నట్టు కనబడుతోంది. ఆదివారం ట్విట్టర్ లో లైవ్ ఛాట్ చేసిన కేటీఆర్ ఏపీ రాజకీయాలపై తనకు పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు.

దీనికి కారణం ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రాబోతుందనే పక్కా సమాచారం తెలియడమేనని అంటున్నారు. జాతీయ ఛానెల్స్ అన్నీ ఏపీలో వైకాపాదే అధికారమని చెబుతున్నారు. లగడపాటి మాత్రం ఏపీ ప్రజలు అనుభవం, సంక్షేమం వైపే మొగ్గుచూపారు. మరోసారి ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. కేటీఆర్ కూడా ఇదే నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన ఏపీ రాజకీయాలని లైట్ తీసుకొన్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మే 23న ఏపీ కొత్త సీఎం ఎవరన్నది తేలనుంది.