ఊపుమీదున్న తెలంగాణ భాజాపా


తెలంగాణలో భాజాపా ఊపుమీద కనిపిస్తోంది. తెరాసకు తామే ప్రత్యామ్నాయమని భావిస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తొంది. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా రెండు స్థానాలు గెలుచుకొంది. అది కూడా ఖమ్మంలోనే. వీరిద్దరు కూడా కారెక్కేశారు. దీంతో తెలంగాణలో తెదేపా ఖాళీ అయ్యింది. త్వరలో కాంగ్రెస్ కూడా ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 13మంది కారెక్కేందుకు రెడీగా ఉన్నారు.

ఇక, మిగిలింది ఆరుగురు మాత్రమే. వీరిలో కొందరు భవిష్యత్ లో కారెక్కే అవకాశాలు లేకపోలేదు. ఇది తమకు కలిసొస్తుంది. తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని భాజాపా భావిస్తుంది. ఇటీవల జరిగిన తెలంగాణ లోక్ సభ ఎన్నికల సమయంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు భాజాపాలో చేరారు. అది భాజాపాకు కలిసొచ్చే అంశమే. ఒక్క ఎంపీ సీటు గెలిచిన భాజాపా బలపడినట్టే.

ఈ నేపథ్యంలో ఇకపై దూకుడుగా వ్యవహరించాలని తెలంగాణ భాజాపా ఫిక్సయినట్టుంది. సోమవారం ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భాజపా అధ్యక్షుడు నిరవధిక నిరసన దీక్ష చేశారు. ఈ దీక్షకు విద్యార్థులు, విద్యా సంఘాల మద్దతు లభించింది. ఐతే, లక్షణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఐతే, భాజాపా లక్ష్యం మాత్రం నెవరేంది. కాంగ్రెస్ బలహీనపడిన వేళ.. తెరాసకు ప్రత్యామ్నాయం తామేననే సంకేతాలని నిరసన దీక్షతో ప్రజల్లోకి తీసుకెళ్లింది కమలం పార్టీ. ఇపై కూడా ఇలాంటి పోరాటాలు కొనసాగిస్తుందట.