మెహ్రీన్.. భంగిమ బాగుందే.. !

హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఆరంభం అదిరింది. హాట్రిక్ విజయాలు అందుకొంది. ఆమె నటించిన తొలి మూడు సినిమాలు కృష్ణగాడి వీర ప్రేమ గాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ హిట్ అయ్యాయి. ఐతే, ఆ తర్వాత మాత్రం వరుసగా ప్లాపులు పలకరించాయి. ఏకంగా ఐదు ప్లాపులు పడ్డాయి. ఇక పాప పనైపోయింది అనుకొన్నారు. ఇంతలో ‘ఎఫ్ 2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి మళ్లీ ట్రాక్’ లోకి వచ్చేసింది

తాజాగా, మెహ్రీన్ ఓ డిఫరెంట్ భంగమలో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను మెహ్రీన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో హీల్స్ పై కూర్చొని కసిగా చూస్తోంది మెహ్రీన్. రోహన్ శ్రేష్ట తీసిన పిక్ ఇదని తెలిపింది మెహ్రీన్. ఈ హాటు పిక్ పై మీరు ఓసారి లుక్కేయండీ.. !