‘మహర్షి’ కృష్ణా రైట్స్ విషయంలో వివాదం.. !

‘మహర్షి’కి ముగ్గురు నిర్మాతలు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్. ఈ ముగ్గురి మధ్య సరైన సంయమనం లేదు. దాని కారణంగా బడ్జెట్ అదుపుతప్పింది. ఏకంగా రూ.90కోట్ల బడ్జెట్ అయింది. షూటింగ్ లోనూ జాప్యం జరిగిందనే ప్రచారం జరిగింది. చిన్న చిన్న గొడవలు కూడా జరిగినట్టు ప్రచారం జరిగింది. ఫైనల్ గా సినిమా మాత్రం పూర్తయింది. మే9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇంతలో ఈ సినిమా కృష్ణాజిలా రైట్స్ విషయంలో నిర్మాతల మధ్య గొడవలు తలెత్తినట్టు సమాచారమ్. ‘సైనికుడు’ సినిమాని
అశ్వినీదత్ నిర్మించారు. ఆ సినిమాకు నష్టాలొచ్చాయ్. అప్పడు ఇచ్చిన మాట ప్రకారం ‘మహర్షి’ నిర్మాణంలో అశ్వినీదత్ కు మహేష్ బాబు చోటు కల్పించాడు. నిర్మాత పివివి కూడా ఇలాంటి కారణాలతోనే ఈ ప్రాజెక్టు భాగస్వామి అయ్యారు.

మహర్షి సంబంధించిన ప్రొడక్షన్ బాధ్యతలన్నీ దిల్ రాజునే చూసుకొన్నారు. సినిమా లాభాల్లో వారి వారి పెట్టుబడుల ప్రకారం లాభాల్లో షేర్ తీసుకునేలా ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు ముగ్గురు నిర్మాతలు. ఐతే, ఇపుడు కృష్ణ జిల్లా రైట్స్ తనకే కావాలని అశ్వినీదత్ బీష్మించుకుని కూర్చోవడంతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దీనిపై మహేష్, దిల్ రాజు.. అశ్వినీదత్ పై ఆగ్రహంగా ఉనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ ఫారిన్ టూర్ లో ఉన్నారు. వచ్చే ఈ వివాదాన్ని తెగొట్టేసాడని అంటున్నారు.