పవన్ ఫ్యాన్స్’ని ఫిదా చేసిన మహర్షి


విడుదలకి ముందే ‘మహర్షి’ని చూసి ఫిదా అయిపోతున్నారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. ఎందుకంటే ? ‘మహర్షి’ పోస్టర్స్ లో జనసేన ఫ్లేవర్ కనిపిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్-పూజాహెగ్డే జంటగా ‘మహర్షి’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య ‘మహర్షి’ మే9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో రేపు (మే1) హైదరాబాద్ లో మహర్షి ప్రీ-రిలీజ్ వేడుకని నిర్వహించబోతున్నారు.
ఈ వేడుకకి సంబంధించి చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ గాజు గ్లాసులో ఛాయ్ ఆస్వాదిస్తూ కనిపిస్తున్నాడు. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహర్షి పోస్టర్స్ కి పవన్ ఫ్యాన్స్ కనెక్ట్ అవుతున్నారు. మహర్షి చేతులో ఉన్న గాజు గ్లాసు తమ గుర్తే అనే ఫీలవుతున్నారు. అసలే పవన్ నుంచి సినిమాలు రాక.. ఆయన ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఫ్లేవర్ కనిపిస్తున్న మహర్షికి పవన్ ఫ్యాన్స్ ఫుల్లుగా సపోర్ట్ చేసేలా కనిపిస్తోంది. అదే జరిగితే మహర్షికి ఎక్స్ ట్రా మైలేజీ దొరికినట్టే.