దిల్ రాజు ముందు చూపుతో ‘మహర్షి’ సేఫ్.. !


ఏప్రిల్ లో విడుదలైన సినిమాలపై హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్ : ది ఎండ్ గేమ్’ ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది. హిట్ టాక్ తెచ్చుకొన్న తెలుగు సినిమాలు మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలపై అవెంజర్స్ ఎఫెక్ట్ పడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని దక్షిణాది సినిమాలు అవెంజర్స్ ఎఫెక్ట్ కు భయపడి వాయిదా పడుతున్నాయి. అర్జున్ సురవరం, అభినేత్రి2 సినిమాలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఐతే, నిర్మాత దిల్ రాజు ముందు చూపుతో ‘మహర్షి’ అవెంజర్స్ ఎఫెక్ట్ నుంచి తప్పుకొన్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి మహర్షి ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. షూటింగ్ లో జాప్యం, ఇతర కారణాల వలన మహర్షి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఏప్రిల్ 25న మహర్షి తీసుకొద్దామనే ప్రయత్నాలు జరిగాయి. ఐతే, అవెంజర్స్ ఎఫెక్ట్ ని ముందే ఊహించిన దిల్ రాజు.. మే9న మహర్షి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. దీంతో మహర్షి బతికిపోయాడు. లేదంటే మహర్షికి డ్యామేజ్ తప్పేది కాదు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ తెరకెక్కింది. మహేష్ కి జంటగా పూజా హేగ్దే నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మించారు. మే9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.