మహేష్26.. ఎక్కడో తేడా కొడుతోంది !

మహేష్25 ‘మహర్షి’ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెడ్ స్వీడుతో జరుగుతున్నాయి. మే9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక, మహేష్ 26వ సినిమా ఎఫ్2 దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది. త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్టుకి తుదిమెరుగులుదిద్దే పనిలో అనిల్ ఉన్నాడు.

ఈ సినిమా కోసం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. అంతేకాదు.. సినిమాలో మహేష్ అజయ్ జోసెఫ్ గా కనిపిస్తాడట. చాలా ఉల్లాసమైన పాత్ర అది. మహేష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డిజైన్ చేశారట. పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది. ఐతే, ‘సరిలేరు నీకెవ్వరు’ అచ్చతెలుగు టైటిల్. అజయ్ జోసెఫ్ అనేది క్రిస్టియన్ పేరు. ఈ రెండింటిని దర్శకుడు ఎలా లింక్ చేశాడన్నది తెర మీద చూడాల్సిందే. ఇక హీరోయిన్ గా రష్మిక మందన పేరు వినిపిస్తుంది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మహేష్26తో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. రమ్యకృష్ణ, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరుల కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్నారు. వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా సినిమా విడుదలని ప్లాన్ చేస్తున్నారు.