ధోనీకి ఇచ్చిన లెక్క చెప్పండి.. ఆమ్రపాలికి సుప్రీం ఆదేశం !


తనని ఆమ్రపాలి సంస్థ మోసం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించకుండా ఆ సంస్థ తనను మోసం చేసిదంటూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 2009-2016 మధ్య ఆమ్రపాలి సంస్థకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించారు. అయితే బ్రాండ్‌ అంబాసిడర్‌గా తన సేవలను వాడుకుని తనకు డబ్బు చెల్లించలేదంటూ ధోనీ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమ్రపాలి గ్రూప్‌ తనకు ఇంకా రూ. 40కోట్ల బకాయిలు చెల్లించాలని తెలిపారు.

అంతేకాదు.. రాంచీలోని ఆమ్రపాలి సఫారీలో ధోనీ ఒక పెంట్‌హౌజ్‌ బుక్‌ చేసుకున్నారు. దాని యాజమాన్య హక్కులను కూడా కల్పించకుండా కంపెనీ తనను మోసం చేసిందని ధోనీ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ధోనీకి ఇప్పటివరకు ఎంత చెల్లించారో చెప్పాలంటూ ఆమ్రపాలి సంస్థను ఆదేశించింది. ధోనీతో జరిపిన అన్ని లావాదేవీల వివరాలను బుధవారం లోగా కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది.