సంచలనం : ఇంటర్ కేసులో కాంగ్రెస్ హస్తం

తెలంగాణ ఇంటర్ బోర్డ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇంకాస్త ముందుగానే స్పందిస్తే.. బాగుండేది. విద్యార్థుల ప్రాణాలు దక్కేవని అంటున్నారు. ఇక ఈ వ్యవహారం ప్రతిపక్షాలకు ఓ అస్త్రంగా మారింది. ఇంటర్ వ్యవహారంలో కాంగ్రెస్, భాజాపాలు పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతున్న సంగతి తెలిసిదే.

ఈ వ్యవహారంలో తప్పు మొత్తం గ్లోబరీనా కంపెనీదేనని తేలిన విషయం తెలిసిందే. ఐతే, గ్లోబరీనా సంస్థ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దగ్గర వ్యక్తులది అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కేటీఆర్ సన్నిహితులు గట్టిగానే స్పందిస్తున్నారు. అసలు గ్లోబరీనాని పెంచి పోషింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది ఒక చిన్న సంస్థగా మొదలై.. గత కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే బాగా ఎదిగింది. అనేక ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకుని పెద్ద కంపెనీగా ఎదిగింది. జె.ఎన్.టి.యు హైదరాబాద్, కాకినాడ, ట్రిపుల్ ఐటీ, బాసర, ఇడుపులపాయ ఆర్జీకేయూటీ, ఇట్లా అనేక ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టులు చేసింది.

ఈ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వంలోని నేతలెవరికీ ఎటువంటి సంబంధం లేదు. టెండర్ కూడా ఈ-ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో తక్కువ కోట్ చేసిన కంపెనీకి ఇచ్చారు. గత పదిహేను సంవత్సరాలుగా ఇంటర్మీడియేట్ బోర్డులో ఒకటే సంస్థ టెండర్ దక్కించుకుంటోంది. దాని పేరు మాగ్నెటిక్ ఇన్‌ఫో. అక్కడ అధికారులను మచ్చిక చేసుకుని.. ఇంకో సంస్థ ఎవరికీ టెండర్ దక్కకుండా అది చక్రం తిప్పుతోంది. ఆ కంపెనీ గుత్తధిపత్యాన్ని తొలగించాలనే ఇంటర్ బోర్డు ఈ సారి కొత్త కంపెనీకి టెండర్ ఇచ్చిందని చెబుతున్నారు.

గ్లోబరీనా సంస్థ తక్కువ కోడ్ చేసేందుకే.. ఆ సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఐతే, అదే సమయంలో ఆ కంపెనీ ప్రతిభ గురించి కూడా ఆలోచిస్తే బాగుండేది. ఇంటర్ విద్యార్థుల ప్రాణాలు నిలిచేవి. మొత్తానికి.. ఇంటర్ బోర్డ్ వ్యవహారంలో తెరాస నేతల హస్తం అస్సలే లేదు. గట్టిగా మాట్లాడితే.. కాంగ్రెస్ నేతలే గ్లోబరీనాని పెంచిపోషించారని కేటీఆర్ పై ఈగ కూడా వాలనీయని ఆయన సన్నిహితుల మాట.