‘మహర్షి’లో ఓ సప్రైజ్ !

మహర్షి సినిమాలో మొత్తం ఎనిమిది పాటలు ఉండబోతున్నాయని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఐతే, ఆరు పాటలతోనే మహర్షి ఆల్భమ్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో నాలుగు మాంటేజస్ సాంగ్స్, రెండు డ్యూయెట్స్ సాంగ్స్ ఉన్నాయి. ఇవేకాకుండా సినిమాలో మరో రెండు సినిమాలు ఉండబోతున్నాయట. ఈ విషయాన్ని మహర్షి ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు.

సినిమాలోని ఏడో పాట ‘ఇదే కదా ఇదే కదా.. నీ కథా.. ‘ని మే3న విడుదల చేయబోతున్నాం. రోమాలు నిక్కబొడిచేలా ఈ సాంగ్ ఉండబోతుంది. అంతేకాదు.. సినిమా ఓ సప్రైజ్ కూడా ఉంది. ఓ సిట్యూవేషన్ సాంగ్ ఉండబోతుంది. దాన్ని ఆల్భమ్ లో పెట్టలేదని తెలిపారు వంశీ. ఇక, మహేష్ అభిమానులు గర్వపడేలా మహర్షి సినిమా ఉండబోతుంది. అభిమానులు ఎంతటి అంచనాలు పెట్టుకొన్నా.. వాటిని మహర్షి అందుకుంటుంది. మహర్షి సినిమాని చూసి మహేష్ అభిమానులు కాలరెగేయొచ్చు అన్నారు వంశీ.