నాన్నతో గొడవపై బన్నీ క్లారిటీ
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. తండ్రి అరవింద్ తో బన్నీ విబేధిస్తున్నాడు అనే ప్రచారం జరిగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ఓ ఇంటర్వ్యూలో బన్నీ స్పందించారు. “అవునా.. నాకు, నాన్నకు గొడవలా? ఈ వార్తలు చదివి చాలా నవ్వుకున్నాం. నేను ఇప్పటికీ నాన్నతోనే ఉంటాను. ఎప్పుడూ పని, జీవితం గురించే మాట్లాడుకుంటుంటాం. మా గురించి ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు” అని తెలిపారు.
బాలీవుడ్ ఎంట్రీపై కూడా బన్నీ క్లారిటీ ఇచ్చారు. నాకు హిందీ సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఉందన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా.. ? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నా సినీ ప్రయాణంలో నాకు కంటెంటే ముఖ్యం. మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఒకే రకమైన జోనర్‌లో సినిమాలు చేయాలని లేదు. కొత్త పాత్రలతో ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం. ప్రతి సినిమాకు కొత్తగా, విభిన్నంగా ప్రేక్షకులకు కనిపించాలనుకుంటున్నాను’నన్నారు.