దే దే ప్యార్ దే : ‘చలే ఆన.. ‘ చూశారా.. ?

అజయ్ దేవగణ్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అలీ అకివ్ దర్శకుడు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది. తాజాగా, ఈ సినిమా నుంచి ‘చలే ఆన.. ‘ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటకు అమాల్ మాలిక్ సంగీతాన్ని అందించారు.

ఇక ఈ సినిమా కోసం రకుల్ భారీగా సైజులు తగ్గించింది. ఏకంగా 10కిలోల బరువు తగ్గింది. నాజుగ్గా తయారైంది. తెరపై అజయ్ దేవగణ్-రకుల్ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరినట్టు ‘చలే ఆన.. ‘ సాంగ్ చూస్తే అర్థమవుతోంది. ఈ పాటని మీరు ఓ సారి చూసేయండీ.. !