చెన్నై చేతిలో ఢిల్లీ చిత్తు చిత్తు

బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించింది. రైనా (59; 37 బంతుల్లో 8×4, 1×6), ధోని (44 నాటౌట్‌; 22 బంతుల్లో 4×4, 3×6) మెరవడంతో మొదట చెన్నై 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. చెన్నై నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులే చేసింది. 10 ఓవర్లలో స్కోరు 53/1. 14వ ఓవర్లో స్కోరు 87. 17 ఓవర్లకు స్కోరు 126/3. ఆ తర్వాత ధోని విశ్వరూపాన్ని చూపించాడు. చెన్నై చివరి మూడు ఓవర్లలో 53 పరుగులు పిండుకుంది. దీంతో 4వికెట్లకు 179 పరుగులు చేసింది.

లక్ష్య చేధనలో చెన్నై బౌలర్ల స్పిన్‌ మాయాజాలానికి దిల్లీ తడబడింది. తాహిర్‌ (4/12), జడేజా (3/9), హర్భజన్‌ (1/28) ధాటికి 16.2 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. శ్రేయస్‌ అయ్యర్‌ (44; 31 బంతుల్లో 4×4, 1×6) టాప్‌ స్కోరర్‌. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోర్ 49/1.ఓవర్లో ధావన్‌ (19)ను అవుటయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో రెండెంకల స్కోర్ కే ఢిల్లీ ఆలవుట్ అయింది.