ఆ ఏడుగురు దర్శకులు మాత్రమే మహేష్’కి స్పెషల్. ఎందుకంటే.. ?


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి మహేష్ నటించిన 24చిత్రాల దర్శకులు హాజరవుతారనే ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. విక్టరీ వెంకటేష్, కొరటాల శివ, విజయ్ దేవరకొండ మాత్రమే గెస్టులుగా వచ్చారు. ఇక, ఈ వేడుక వేదికగా మహేష్ ఏడుగురు దర్శకులకి ప్రత్యేక కృజ్ఝతలు తెలిపారు. ఆ దర్శకుల సినిమాలు తన ఎదుగుదలకి ఏ విధంగా దోహాదం చేశాయన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు సూపర్ స్టార్.

“ఈ పాతిక సినిమాల జర్నీలో నేను థ్యాక్స్ చెప్పాల్సిన దర్శకులు కొందరు ఉన్నారు. ముందుగా రాఘవేంద్ర రావు గారు. ఆయన నన్ను హీరోగా పరిచయం చేశారు. కృష్ణవంశీ ‘మురారీ’ సినిమా నేను యాక్టింగ్ చేయగలనని నిరూపించింది. నన్ను స్టార్ ని చేసిన సినిమా గుణశేఖర్ ‘ఒక్కడు’. ఫ్యామిలీ ప్రేక్షకులు, యూఎస్ ప్రేక్షకులకి దగ్గర చేసిన సినిమా త్రివిక్రమ్ ‘అతడు’. నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ శ్రీనువైట్ల ‘దూకుడు’. నాకు రెండు సార్లు లైఫ్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ. శ్రీమంతుడు, భరత్ అను నేను సినిమా లతో హిట్ ఇచ్చారు. తన 25వ దర్శకుడు వంశీపైడిపల్లి. వీరందరికీ థ్యాక్స్” అన్నారు మహేష్.