రాజమౌళి స్పూర్తితో శంకర్ సినిమా


శంకర్, రాజమౌళి భారతదేశం గర్వించదగ్గ దర్శకులు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకులు. వీరిద్దరికి ఒకరంటే మరొకరు ఇష్టం. గౌరవం. రాజమౌళి దర్శక ప్రతిభకు శంకర్‌ ఫిదా అవుతారు. ‘2.ఓ’ సినిమా ఆడియో వేడుక వేదికపై రాజమౌళి గురించి గొప్పగా చెప్పాడు. శంకర్ అన్న రాజమౌళి అంతే ఇష్టం. ఐతే, ఇప్పుడు శంకర్ రాజమౌళిని ఫాలో కాబోతున్నాడట.

రాజమౌళి ‘బాహుబలి’ మల్టీస్టారర్. ఈ సినిమాతో ప్రభాస్, రానాలు ఇంటర్నేషనల్ స్టార్స్ అయ్యారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ కూడా మల్టీస్టారర్ చిత్రమే. ఇందులో తారక్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పుడు శంకర్ కూడా ఓ మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. గతంలో విజయ్, జీవా కథానాయకులుగా ‘3ఇడియట్స్’ని రిమేక్ చేశారు శంకర్. ఐతే, అది పెద్దగా ఆడలేదు. ఐతే, తాజాగా శంకర్ మరో మల్టీస్టారర్ ని ప్లాన్ చేసినట్టు సమాచారమ్.

కమల్ హాసన్ హీరోగా శంకర్ చేయాల్సిన ‘భారతీయుడు2’ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ గ్యాప్ లో విజయ్, విక్రమ్ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా రాజమౌళి తరహా ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేస్తూ సినిమాని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో నిజమెంత ? అనేది త్వరలోనే తెలియనుంది.