జగన్ తో అమిత్ షా పొత్తుల చర్చలు

దేశంలో ఎన్నికల సమరం ఇంకా ముగియలేదు. ఇంకా మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ మిగిలేవుంది. దాదాపు 169 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అప్పుడే పొత్తులు-ఎత్తులకి తెరలేపింది భాజాపా. హంగ్ వస్తే పరిస్థితి ఏమిటీ అన్న దిశగా ఆ పార్టీ ముందే ఆలోచన చేసింది. అప్పుడే ఎన్డీయేతర పార్టీలతో ప్రాథమిక చర్చలని మొదలెట్టింది. ఇందులో భాగంగా వైకాపా అధినేత వైఎస్ జగన్ తో భాజాపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారమ్.

దేశంలో హంగ్ ఏర్పడితే.. వైఎస్ జగన్ కింగ్ మేకరే అవుతారని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. కనీసం 20 సీట్ల వరకు వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంటుందంటూ దాదాపు అన్ని రకాల సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భాజాపా జగన్ కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. జగన్ కోరుకొనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు, జగన్ తో పాటు ఆయన పార్టీ నేతలపై ఉన్న ఆర్థిక నేరాల కేసులపై.. ఓ మాటిచ్చినట్టు సమాచారమ్.