తుఫాను బాధితులకి తక్షణ సాయం


ఫొని తుఫాన్ బాధితులకి తక్షణ సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బాధితుల ఖాతాలోని నేరు డబ్బు పంపించేందుకు ఏర్పాట్లు చేసుకొంది. ఇందుకోసం టెక్నాలజిని వాడుకోనుంది. అధికారులు ఇంటికొచ్చి నష్టపరిహారం అంచన వేయరు. బాధితులే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా ఏర్పాట్లను చేసింది.

తుపాను నష్టం తాలూకు ఫోటోలను ‘పీపుల్ ఫస్ట్ యాప్’ పంపాల‌ని బాధితుల‌ను కోరింది. క్రౌడ్ సోర్సింగ్ ద్వారా తక్షణ మదింపు చేసి.. నష్టపరిహారాలను నేరుగా బాధిత రైతుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం 1100 కాల్‌సెంటర్‌ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐతే, రైతుల్లో నిరక్షరాస్యులే అధికం. ఇదీకాకుండా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిన్నది. కరెంట్ లేక మొబైల్ ఫోన్స్ లో ఛార్జింగ్ లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు నష్టపరిహారం తాలుకు పోటోలని ‘పీపుల్ ఫస్ట్ యాప్’ పంపడం ఇబ్బందితో కూడుకున్న పనే.