ఫొని బీభత్సాలు చూశారా.. ?

ఫొని తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో 200కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ గాలులకి చెట్లు, ఇంటిపై కప్పులు, విద్యుత్ స్థంబాలు కుప్పకూలుతున్నాయి. విద్యుత్ వైరల్ తెగిపడుతున్నాయి. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు జాతీయ ఛానెల్స్, ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

వాటిని చూస్తే.. ఫొని బీభత్సం ఏ రేంజ్ లో ఉన్నది అనేది అర్థమవుతోంది. ఓ బ్రిడ్జిపై వాహనదారుడు ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని నిలబడిన వీడియో వైరల్ అయింది. ఇక, తెలుగు రాష్ట్రం ఆంధ్రపదేష్ ఫొని గండం నుంచి బయటపడింది. ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం వాటిల్లలేదని శ్రీకాకుళం కలెక్టర్ ప్రకటన చేశారు. కాకపోతే.. అక్కడక్కడ కొన్ని విద్యుత్ స్తంభాలు, చెల్లు నెలకొరియాయి. వాటిని వెంటనే పునరిద్దరిస్తామని తెలిపారు. ఏపీకి గండం తప్పిన వెంటనే ఒడిషాకి గండం మొదలైంది.

మరికొద్ది సేపట్లో పూరి వద్ద ఫొని పూర్తిగా తీరం దాటనుంది. ఈ ఎఫెక్ట్ ఒడిషాపై గట్టిగా పడనుంది. దాన్ని ముందే ఊహించిన ఒడిషా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకొంది. లోటత్తు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించింది. వారికి ఆహార పదార్థాలని కూడా రెడీ చేస్తున్నారు. సహాయం కోసం హెల్ఫ్ నెంబర్లని ప్రభుత్వం విడుదల చేసింది.