‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎఫెక్ట్ : ఆ రెండు థియేటర్ల లైసెన్సులు రద్దు

ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకి ఇంకా ఈసీ అనుమతి లభించలేదు. అయినా.. కడపలోని రెండు థియేటర్స్’లో గురువారం సినిమాని ప్రదర్శించారు. దీనిపై ఈసీ సీరియస్ అయింది. ఆ రెండు థియేటర్ల లైసెన్సులు రద్దు చేసినట్లు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. సినిమా ప్రదర్శించకుండా అడ్డుకోలేకపోయిన జాయింట్ కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశామని ద్వివేది తెలిపారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మీ పార్వతీ ఏపీసోడ్ ని లక్ష్మీ పార్వతీగా తెరకెక్కించారు. ఒక్క ఏపీలో తప్ప ప్రపంచవ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైంది. ఏపీలో ఎన్నికల కోడ్ అమలు ఉన్న కారణంగా వాయిదాపడింది. మే 1 లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకి రెడీ అయినా.. ఆఖరి నిమిషంలో ఈసీ నుంచి అభ్యంతరాలతో మరోసారి వాయిదాపడింది. ఇక, త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పట్లో ఏపీలో విడుదల కావడం కష్టమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి.