తుఫాన్ పోయింది.. వరదల ముప్పు మిగిలింది !
పొని తుపాను ముప్పు నుంచి సిక్కోలు బయటపడింది. పూరి వద్ద ఫొని తీరం దాడుతోంది. ఈ ఉదయం 11గంటలకు వరకు పూర్తిగా తీరం దాటనుంది. దీంతో ఏపీకి ఫొని తుఫాన్ ముప్పు తొలిగినట్టయింది. ఐతే, వరదలు వచ్చే అవకాశాలున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ తో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో 10సె.మీ పైగా వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో వరదలు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండాని అధికారులు సూచిస్తున్నారు.
బహుదా, వంశధార నదుల్లో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. ఇచ్ఛాపురంలో మూడు కచ్చా గృహాలు మినహా… ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు రిపోర్టు కాలేదని చెప్పారు. స్తంభాలు కొన్ని వాలిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. వాటిని తక్షణం పునరుద్ధరిస్తామని కలెక్టర్ చెప్పారు. ఐతే, తుఫాన్ ముప్పు తగ్గిన వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.