ఏపీలోనూ స్థానిక సమరం.. త్వరలోనే !
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ వెంటనే లోక్ సభ ఎన్నికలొచ్చాయ్. ఆ ఫలితాలు రాకముందే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకి నోటీఫికేషన్ వచ్చేసింది. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సమరం జరుగుతోంది.
ఏపీలోనూ త్వరలోనే స్థానిక సమరం మొదలు కానుంది. ఏపీలోని 13,060 గ్రామ పంచాయతీలకు తర్వలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై శుక్రవారం ఎన్నికల కమిషనర్ సమీక్ష నిర్వహించారు. మొత్తం మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు కమిషనర్ తెలిపారు. మొదటి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, రెండో దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడోదశలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. గతంలో 60శాతం రిజర్వేషన్లను అమలు చేశాం. ఐతే, సుప్రీంకోర్టు 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయరాదని ఆదేశించిందని నిమ్మగడ్డ గుర్తు చేశారు.