ప్రియాంక ఇంట్లో పెళ్లి క్యాన్సిల్ !
గ్లోబల్ స్టార్ ప్రియాంక ఇంట్లో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ వివాహం గత వారంలోనే ఇషితా కుమార్ అనే యువతితో జరగాల్సి ఉంది. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లికి ఇంట్లోవారూ కూడా అంగీకరించారు. సోదరుడి పెళ్లి కోసం ప్రియాంక అమెరికా నుంచి ముంబైకి వచ్చింది. కానీ, పెళ్లి జరగలేదు. ఎందుకంటే.. ? పెళ్లికి ఒకట్రెండు రోజుల ముందే ఇషితాకు సర్జరీ జరిగింది. దీంతో వీరి పెళ్లి వాయిదాపడిందనే వార్తలొచ్చాయ్.
లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ పెళ్లి మొత్తానికే రద్దయింది. షితా ఇన్‌స్టాగ్రామ్‌లో నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలను తొలగించారు. సోదరుడి పెళ్లి నిమిత్తం అమెరికా నుంచి ముంబయి చేరుకున్న ప్రియాంక.. రెండు రోజుల్లోనే తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు, ప్రియాంక మెట్టినింట్లో మరో వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ప్రియాంక భర్త నిక్ జొనాస్ సోదరుడు జో జొనాస్ వివాహం బుధవారం ఘనంగా జరిగింది. లాస్‌వెగాస్‌లో జో జొనాస్.. హాలీవుడ్ నటి సోఫీ టర్నర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు.