సైరా అగ్నిప్రమాదంపై చరణ్ వివరణ

హైదరాబాద్‌ శివారులోని కోకాపేటలో చిరంజీవి ఫాంహౌజ్‌లో ‘సైరా’ సినిమా కోసం భారీ సెట్ వేశారు. గత కొద్దిరోజులుగా ఇక్కడ కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. గురువారం రాత్రి వరకు షూటింగ్ కొనసాగింది. శుక్రవారం తెల్లవారు జామున సెట్స్ లో మంటలు చెలరేగి.. సెట్ అంతా కాలిపోయిన సంగతి తెలిసిందే. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలని అదుపులోని తీసుకొచ్చింది.

ఈ ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ స్పందించారు. “ప్రమాదవశాత్తు ఇవాళ తెల్లవారుజామున కోకపేటలో సైరా సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి చిత్రబృందం సురక్షితంగా బయటపడింది. ఎవరి ఎలాంటి గాయాలు కాలేదు. ఇక, సైరా ఆఖరి షెడ్యూల్ పై ఫోకస్ పెట్టబోతునాం” అని రాసుకొచ్చాడు రామ్ చరణ్.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా తెరకెక్కుతోంది. తొలి తరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. చిరుకి జంటగా నయనతార నటిస్తున్నారు. కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతి బాబు.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.