గంభీర్ వ్యక్తిత్వంపై మరో ఎటాక్
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వ్యక్తిత్వంపై భారత జట్టు మానసిక నిపుణుడిగా పనిచేసిన పాడీ అప్టాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గంభీర్ ఎప్పుడు అభద్రతాభావంతో ఉంటాడు. సెంచరీ కొట్టినా సంతృప్తి పడడు. డబుల్ సెంచరీ ఎందుకు కొట్టలేదని బాధపడుతుంటాడు. ఐతే, టెస్ట్ క్రికెట్ లో బాగా సక్సెస్ అయిన ఆటగాడు గంభీర్ అని పాడీ పేర్కొన్నారు. పాడీ కామెంట్స్ మరవకముందే… గంభీర్ వ్యక్తిత్వంపై పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిది అఫ్రిది ఎటాక్ చేశాడు.
అఫ్రిది తన ఆత్మకథ ‘గేమ్ ఛేంజర్’లో గంభీర్ వ్యక్తిత్వం గురించి ప్రస్తావించారు. “కొంత మంది వ్యక్తిగతంగా ప్రత్యర్థులు.. మరి కొంత మంది ఆటపరంగా ప్రత్యర్థులు. అందులో గంభీర్ మొదటి రకం. అతని వ్యక్తిత్వమే అతని సమస్య. అసలు అతనికి వ్యక్తిత్వమే లేదు. క్రికెట్ అనే పెద్ద ప్రపంచంలో అతను ఒక పాత్ర మాత్రమే. కానీ గంభీర్ మాత్రం డాన్ బ్రాడ్‌మన్, జేమ్స్‌బాండ్ లక్షణాలు కలిపి తనలోనే ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాడు. చెప్పుకోదగ్గ ఒక్క రికార్డు కూడా గంభీర్‌కు లేదు. కేవలం అతని ప్రవర్తనతోనే అందరి నోళ్లలో నానుతుంటాడు” అని రాసుకొచ్చాడు. గంభీర్ అసలు తగ్గే మనిషి కాదు. అఫ్రిదికి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొచ్చు.