రకుల్’ని ఎవరైనా ట్రై చేసుకోవచ్చు.. !

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా సింగిల్. ఎవరితోనూ ప్రేమలో పడలేదు. కాకపోతే.. ప్రేమలో పడేందుకు రెడీగా ఉంది. ప్రియుడు కోసం ఎదురు చూస్తోంది. ‘నిజ జీవితంలో నేను ప్రేమలో పడేందుకు ఎదురుచూస్తున్నా. ఆ వ్యక్తి వృద్ధుడా ? లేదా యువకుడా?అనేది అనవసరం’ అంటోంది రకుల్. దీంతో రకుల్ ని ఎవరైనా ట్రై చేసుకోవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్‌ దే’ ఇదే లైన్ తో తెరకెక్కింది. ఇందులో రకుల్ 26 ఏళ్ల రకుల్‌ 50 ఏళ్ల అజయ్‌ ప్రేయసిగా నటించారు. ఆయన మాజీ భార్య పాత్రను టబు పోషించారు. ఈ సినిమా ప్రభావం రకుల్ పై గట్టిగానే పడినట్టుంది. అందుకే నిజ జీవితంలోనూ ప్రేమలో పడేందుకు వయసుతో సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతోంది.

‘దే దే ప్యార్‌ దే’ చిత్రానికి అకీవ్‌ అలీ దర్శకత్వం వహించారు. వయసుతో సంబంధం లేకుండా ఓ మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రకుల్ మునుపెప్పుడూ లేనంత హాటుగా కనిపిస్తోంది. ఈ సినిమా ఈ నెల17న ప్రేక్షకుల ముందుకు రానుంది.